telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పోస్టాఫీస్ అకౌంట్ లో కూడా.. మినిమమ్ బ్యాలన్స్ ఉండాల్సిందే.. లేదంటే..

minimum balance in post office accounts is must

దేశంలో సామాన్యులకు నగదు దాచుకునే స్థానాలలో మొదటిది ప్రభుత్వ బ్యాంకులైతే, రెండోది పోస్ట్ ఆఫీస్. రోజూవారిగానో, నేలవారిగానో మిగిలినది ఖర్చు కాకుండా ఈ రెండిటిలో ఎక్కడో అక్కడ దాచేసుకుంటారు. ఇక పోస్ట్ ఆఫీస్ లో అయితే అనేక చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకునే పథకాలు కూడా ఉండటంతో వాటిలో కూడా నగదు పెట్టేస్తున్నారు. పెట్టుబడులు పెట్టడం ఈ మద్యే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఆకర్షణీయ వడ్డీ నమ్మకంగా లభిస్తుంది. అయితే వీటిని చేయడానికి మొన్నటివరకు లేని కొత్త నిబంధన .. పోస్టాఫీస్ స్కీమ్స్ కింద అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.500 ఖచ్చితంగా ఉండాలి. ఒక వేళా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే రూ.500 అవసరం అవుతుంది. ఒక వేళా మీకు చెక్‌బుక్ కూడా కావాలి అని అనుకుంటే రూ.500 అవసరం అవుతుంది. ఇలా ఏమి వద్దు అనుకుంటే ఖాతాదారుడు రూ.50 మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తే సరిపోతుంది.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.100 ఉండాలి. అలాగే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్) అకౌంట్‌కు కూడా రూ.100 మినిమమ్ అమౌంట్ కచ్చితంగా ఉండాలి. ఒక వేళా అదే సమయంలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ అకౌంట్‌కు రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ ఉండే లాగా చూసుకోవాలి. రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ సేవలు కూడా ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ విషయానికి వస్తే ఐదేళ్లు. నెలలో ఏ రోజైనా ఆర్‌డీ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఎప్పుడైనా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇంకా సీనియర్ సిటిజన్ కోసం కూడా ఒకటి ఉంది అది ఏమిటి అంటే .. సీనియర్ సిటిజన్ అకౌంట్‌ కూడా ఏడాది తర్వాతనే క్లోజ్ చేసుకోవడానికి చాల సులభంగా ఉంటుంది.

Related posts