telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విజయశాంతి బీజేపీలో చేరేందుకు కసరత్తులు పూర్తయ్యాయా..?

vijayashanthi

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు విజయశాంతి బీజేపీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండుసార్లు సమావేశమయ్యారు. సంజయ్‌తో సమావేశానికి ముందే విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమైనట్లుగా విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం. ఆ తరువాత విజయశాంతి తన విమర్శల్లో పదును పెంచారు. కాగా, నవంబర్ 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లేదా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో విజయశాంతి బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం. విజయశాంతి రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అదే పార్టీలోకి చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ఈ విషయం పై ఇంతకముందు నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ విజయశాంతి పార్టీ మారదని..తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలోకి విజయశాంతి వెళ్లదని..ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడానని తెలిపారు. అయితే…మాధుయాష్కీ వ్యాఖ్యలపై స్వయంగా విజయశాంతి స్పందించారు. “రాష్ట్ర కాంగ్రెస్‌లో కొందరు నాయకులు చానెల్స్‌లో లీకేజిల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీగారికి నా ధన్యవాదాలు.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

Related posts