telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో అందుబాటులోకి మరిన్ని లింక్ రోడ్లు…

హైదరాబాద్ వాసులకి ట్రాఫిక్ సమస్య తీరితే అంతకన్నా మంచి న్యూస్ ఏమి ఉంటుంది చెప్పండి. తాజాగా ఈరోజు నుండి సిటీలో అందుబాటులోకి మరిన్ని లింక్ రోడ్లు రానున్నాయి. నేడు సిటీలోని పలు ప్రాంతాల్లో 42₹ కోట్లతో చేపట్టిన కనెక్టివిటీ రోడ్లను ప్రారంభిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆ మూడు రోడ్లలో ఒకటి ఓల్డ్ ముంబై రోడ్డు లెదర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 వరకు లింక్ రోడ్. మరొకటి ఖజా గూడ చెరువు నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు ఉన్న రోడ్, ఇక మూడో రోడ్ ఏమో హైదర్ నగర్ మిత్రా హిల్స్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు ఉండనుంది. ఇక ఇప్పటికే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుండి రాయదుర్గం లెదర్ పార్క్ వరకు నిర్మించిన లింక్ రోడ్ను ప్రారంభించి, వియుపి బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు  తలసాని,సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే గాంధీ,ఎమ్మెల్సీ నవీన్ రావు,మేయర్ బొంతు రామ్మోహన్ లు పాల్గొన్నారు. రద్దీ గల మూడు మార్గాల్లో అందుబాటులోకి లింక్ రోడ్లు రానున్నాయి. దీంతో కొంత ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Related posts