telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఏపీలో పార్టీ పెట్టాలంటూ విజ్ఞ‌ప్తులు- కేసీఆర్

హైదరాబాద్ లోని హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెస‌ర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు హృదయపూర్వక ధన్యవాదాలు

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ పార్టీ‌లోని అన్ని విభా‌గాలు, అన్ని సామా‌జి‌క‌వ‌ర్గాల నేతలు మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లు‌ చే‌శారు.

తొలిసారి 2001 సంవత్సరంలో జల దృష్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రక రకాల అప నమ్మకాల మధ్య గులాబీ జెండా ఎగిరిందని , ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించామ‌ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మరియు నేతల కారణంగా పార్టీ ఈ స్థితికి వచ్చిందని కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే… తెలంగాణ రాష్ట్ర పోరాటం సాగిందన్నారు. చ‌రిత్ర‌లో తెలంగాణ ఉద్య‌మానికి, ఉద్య‌మ‌కారుల‌కు శాశ్వ‌తంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని కొందరు దుష్ప్రచారం చేశారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశాం. ఎఫ్‌సీఐ కూడా మేం కొనలేమని చెప్పేస్థాయిలో వరి పండించామన్నారు కేసీఆర్.

అంతేకాకుండా ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలిపారు. దళితబంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయని, ఏపీలో కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టండని, గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారన్నారు.ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని , తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నారు.కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

 

Related posts