పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధును ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భీమవరంలో అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన పుట్ట మధు..ఏడు రోజులుగా ఫోన్ స్విచ్ చేసుకున్నాడు. అయితే ఇవాళ పుట్ట మధు అరెస్ట్ కావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. అసలు పుట్ట మధును ఎందుకు అరెస్ట్ చేశారన్న ప్రశ్న అందరిలోనూ రేకెత్తుతోంది. అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధుపై ఆరోపణలు వచ్చాయి. ఓ కేసు విషయంలో వారం రోజులు క్రితం పుట్ట మధుకు కాల్ చేశారు ఓ పోలీస్ ఉన్నతాధికారి. తర్వాతే ఆయన మంథని పట్టణాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం కూడా సాగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పుట్ట మధును ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రామగుండం టాస్క్ పోలీసులు అదుపులో పుట్ట మధు ఉన్నారు. పుట్ట మధును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఏడు రోజులు పాటు ఎక్కడ ఉన్నాడు.. అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు అనే దానిపై విచారణ కొనసాగుతోంది. హత్య కేసుకు సంబంధించి గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి పుట్ట మధును ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
previous post