ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అందరి మద్దతు కూటగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమ ఆవేదన చెప్పుకొని మద్దతు ఇవ్వాలని కోరారు, ముందు సుముఖత వ్యక్తం చేసినా తరువాత ఏమైందోగాని, ముఖం చాటేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంపీ కేశవరావు, ఇతరులెవరూ సుముఖంగా ఉన్నట్టు కన్పించడంలేదని స్వయంగా పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నిన్న తనను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిశారనీ.. సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు పీటముడిలా మారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పిన పవన్.. . సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని తనను కోరారని అయితే, తాను సీఎం కేసీఆర్ ఎంపీ కేశవరావు, కొందరు మంత్రులను కలిసేందుకు సమయం కోసం జనసేన ప్రతినిధులు ప్రయత్నించారని, ఎందుకోగాని దీనిపై మాట్లాడేందుకు వాళ్లెవరూ సిద్ధంగా లేరని పవన్ చెప్పుకొచ్చాడు. బహుశా కేసీఆర్ ఆయనకి కూడా ఒక బిస్కెట్ వేసి బుజ్జగిచినట్టే ఉందని కార్మికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.