ఖమ్మం జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని…కేటిఆర్, కేసీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు నాయకులు కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన రైతు పోలీకేక సభలో ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం, రాష్ర్టంలో రైతు వెన్నుముక విరిచేందుకే వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మిర్చి రైతుల గిట్టుబాటు కోసం రైతులు పోరాడితే అరెస్ట్ చేసి రైతుల చేతులకు బేడీలు వేసి బందీపోటు దొంగలా చేసిన ఘనుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. గిట్టుబాటు ధర రాకపోతే రైతులే మంట పెట్టి తగలబెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. రైతు పండించిన పంటకు దళారులు ధర నిర్ణయస్తున్నారని..కాంగ్రెస్ గిట్టుబాటు ధర చట్టం చేసిందని గుర్తుచేశారు.కల్లాల వరకే వచ్చి కార్పోరేట్ వాళ్లు కోనుగోలు చేసే పరిస్థితి ఉందన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎందుకు తీర్మాణం చేయలేదని ప్రశ్నించారు.రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని… ఎవరు ఆత్మహాత్యలు చేసుకోవద్దని కోరారు.అమ్ముడు పోయేటోళ్లను ఏరివేయాలని…డిపాజిట్లు పోయిన నాయకుల పెత్తనం కాంగ్రెస్ లో ఉండదని కేంద్ర పార్టీ చెప్పిందన్నారు.
previous post