telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారతదేశం.. తయారీరంగంలో ముందుంటుంది.. : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

india will be top in manufacturing

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భారత్ ను తయారీ రంగం హబ్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. కేంద్ర కేబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు ప్రకాశ్ జవదేవకర్, పీయూష్ గోయల్ ఢిల్లీలో మీడియాకు వివరించారు. గతంలో విదేశీ మారక నిల్వలు సున్న స్థాయికి పడిపోయాయని, మోదీ హయాంలో వాటి నిల్వలు 280 మిలియన్ డాలర్లకు చేరాయని అన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, ఎఫ్ డీఐ నిబంధనలు సరళీకరించి పెట్టుబడులను పెంచామని చెప్పారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని అన్నారు. ప్రింట్ మీడియాలోని 26 శాతం ఎఫ్ డీఐల అనుమతి డిజిటల్ మీడియాకు వర్తిస్తుందని, బొగ్గు గనుల్లో వంద శాతం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు అనుమతించాలని తదితర నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.

Related posts