telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా సెకండ్ వేవ్ లో అప్రమత్తమైన రాష్ట్రాలు ఇవే…

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మళ్ళీ మన దేశంలో విజృంభిస్తూనే ఉంది. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.  ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.  ఢిల్లీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  దీంతో అక్కడ కరోనా టెస్టులను పెంచాలని నిర్ణయించింది.  కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే రెండువేల రూపాయల జరిమానా విధించాలని కూడా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మరోవైపు హర్యానాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  తొలిసారిగా హర్యానాలో 3వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో నవంబర్ 30 వ తేదీ వరకు స్కూల్స్ ను మూసేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  ఇక మధ్యప్రదేశ్ లోని ఐదు, గుజరాత్ లోని నాలుగు జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.  రాజస్థాన్ లోని 33 జిల్లాల్లో 144 సెక్షన్ ను విధించారు.  దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రెండో దశ కరోనా నేపథ్యంలో అప్రమత్తం అయ్యింది.  అవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది.  ఇక మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది.  ముంబై, థానే, నవీ ముంబై, పన్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని స్కూల్స్ ను డిసెంబర్ 31 వరకు మూసేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts