రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక పరిణామం, ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలకు ఇంకో షాక్ తగిలింది.పార్టీ ఫిరాయించారంటూ రెబల్ ఎమ్మెల్యేలపై తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేలకు మరో షాక్ తగిలింది… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై జేడీ(ఎస్) వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
ఉత్కంఠభరితమైన పరిణామాల మధ్య కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం, రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు.. తాజాగా, తమ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన గోపాలయ్య, హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ అధినేత దేవెగౌడ ప్రకటించారు. ప్రభుత్వాన్ని అయితే కూల్చగలిగారు… కానీ, పదవీ, పార్టీ రెండూ పోయిందని పలువురు చర్చించుకుంటున్నారు.