telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఉపవాసం ఉంటున్నారా… అయితే ఇవి తెలుసుకోండి !

ఉపవాసం అనేది ప్రతి ఇంట్లో అందరికి సాధారణమే. అయితే ఈ ఉపవాసాలు ఎక్కువగా మహిళలు చేస్తారు. ఈ ఉపవాసాలు అసలు మగవారికి నచ్చవు. వందలో ఎవరో ఒకరు చేస్తారు. అదే మహిళల విషయానికి వస్తే… తమ ఫామిలీ బాగుండాలి, అది నెరవేరాలి, ఇది నెరవేరాలి అంటూ దేవుడికి ఉపవాసాలుంటారు. సోమవారం శివునికి, మంగళవారం హనుమంతునికి, గురువారం సాయి బాబాకి , శనివారం వస్తే వెంకటేశ్వరా స్వామికి ఉపవాసాలు ఉంటారు మహిళలు. అయితే.. ఈ ఉపవాసాల వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయట. కానీ అందరు నీరసం వస్తుంది అనుకుంటారు కానీ దీని వల్ల లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అసలు దీని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి… అవి ఏంటి అనేది చూద్దాం…
ఆకలిపై నియంత్రణ మెరుగవుతుంది
హై బీపీ తగ్గును
పెద్ద వ్యాధులకు మూలమైన వాపు స్వభావం తగ్గుతుంది
ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గును
చెడు కొలస్ట్రాలు అదుపులోకి వస్తాయి
కణాలను దెబ్బతిసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.. తద్వారా కాన్సర్ ముప్పు తగ్గును
రుమాటాయిడ్ ఆర్థైటీస్ వంటి ఆటో ఇమ్మ్యూన్ సమస్యలు తగ్గుముఖం పడుతాయి

ఆయుర్దాయం పెరుగుతుంది
ఒంట్లో ఇన్సులిన్ ను గ్రహించే స్వభావం మెరుగవుతుంది
రక్తంలో గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది
ఒత్తిడిని, వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది
ఏకగ్రత, మెదడు పని తీరు మెరుగవుతుంది..
వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు

Related posts