telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

తగ్గుముఖం పడుతున్న … బంగారం ధరలు..

gold and silver prices in markets

దేశి మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో నేడు మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయిల తగ్గుదలతో 39,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 90 రూపాయిల తగ్గుదలతో 36,360 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా తగ్గింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 200 రూపాయిలు తగ్గుదలతో 47,800 రూపాయలకు చేరింది.

అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

Related posts