ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ రేపు స్విట్జర్లాండ్‌లో తీయబోయే డ్రాలో పాక్‌తో పాటు ఆస్ట్రియా, రష్యాతో కూడా భారత్ తలపడనుంది. ఇప్పటికే డ్రాకు సంబంధించిన పాట్స్ సిద్ధమయ్యాయి. డ్రా దృష్ట్యా ఇప్పటికే ప్రపంచ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఒసానియా కప్‌లో విజేతలుగా నిలిచిన నేపథ్యంలో న్యూజిలాండ్ మహిళల జట్టు, ఆస్ట్రేలియా పురుషుల జట్టు టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి.
దీంతో పురుషుల పాట్ 1లో నెదర్లాండ్స్, భారత్, జర్మనీ ఉన్నాయి. పాట్4లో పాకిస్థాన్, ఆస్ట్రియా, రష్యా ఉన్నాయి. ఇక పాట్2లో గ్రేట్ బ్రిటన్, స్పెయిన్, న్యూజిలాండ్, కెనడా.. పాట్3లో మలేసియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, కొరియా జట్లు ఉన్నాయి. మ్యాచ్ షెడ్యూల్, వేదికలు డ్రా తర్వాత నిర్ణయించనున్నారు. మరోవైపు ఒలింపిక్ హాకీ టోర్నమెంట్ 2020 జులై 25 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించనున్నారు. పన్నేండేసి చొప్పున మహిళలు, పురుషుల జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనున్నాయి.