telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీసీఎం .. వరదముప్పు ప్రాంతాలలో పర్యటించాలి.. ప్రతిపక్షం డిమాండ్ ..

ycp letter to CS on praja vedika building

ఇటీవల కృష్ణా నదికి సంభవించిన వరదల కారణంగా ప్రజలు ఇళ్లు, పంట పొలాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ముంపు బాధితులను, రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి తగిన నష్టపరిహారం చెల్లించడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందిస్తూ, వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం సరిపోదని, రూ.4 వేల కోట్ల నష్టం జరిగితే రూ.95 కోట్లు అని ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారని మండిపడ్డారు.

Related posts