telugu navyamedia
వార్తలు సామాజిక

ప్రైవేట్ స్కూల్స్ మేనెజమెంట్ పై తప్పుడు పోస్టులు!

half day schools in AP since high temp

ప్రైవేట్ స్కూల్స్ మేనెజమెంట్ పై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో వస్తున్న కొన్ని తప్పుడు పోస్టులపై భీమిలి కేథరిన్ విద్యా సంస్థల అధినేత ఆలివర్ రాయి స్పందించారు. ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూల్స్ మేనెజమెంట్ అంటే రక్తం తాగే జలగలు అన్నట్టు వైరల్ చేస్తున్న సోషల్ మీడియా వీరులకు కొన్ని ప్రశ్నలు, వాస్తవాలను ఓ ప్రకటనలో తెలిపారు.

కార్పొరేట్ స్కూల్ లను సాధారణ, బడ్జెట్ స్కూల్ లను కలిపేసి ప్రైవేట్ స్కూల్స్ అని ఒకే ముద్ర వేస్తున్నారు . కార్పొరేట్ సంస్థలు 10 – 15 % ఐతే 85 – 90 % బడ్జెట్ (చిన్న) స్కూల్స్ అన్నది ముందు గ్రహించాలి ప్రైవేట్ స్కూల్స్ అన్ని కార్పొరేట్ స్కూల్స్ అనే అపోహ మానుకోవాలని పేర్కొన్నారు.

విద్యా సంవత్సరం చివరిలో లాక్ డౌన్ వల్ల హఠాత్తుగా స్కూలు మూసినసమయానికి వందల మంది పిల్లలు మూడు మరియు నాలుగో వాయిదా ఫీజు చెల్లించలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ లోపు చెల్లిస్తారులే అని, ఉన్నలేకున్నా జీతాలు ఇచ్చిన పరిస్థితుల్లో, ఆ ఫీజు బకాయి తల్లిదండ్రులు ఇప్పుడు చెల్లిస్తారు? అడిగితే సోషల్ మీడియా వీరులు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

కరెంటు బిల్ కట్టకపోతే గవర్మెంటే కరెంటు కట్ చేస్తుంది, పెనాల్టీలు కూడా వేస్తుంది. రూ 100/- బిల్ కు రూ 75/- పెనాల్టీ వేస్తే తప్పు లేదు !! కరెంటు కట్ చేస్తే తప్పు లేదు? స్కూల్ ఫీజులు ఆడితే సోషల్ మీడియా వీరులు అదేదో మహా పాపంలా రెచ్చిపోతారు.  స్కూల్ లో ఎంత మంది డబ్బున్నవారు పనిచేస్తున్నారు? వారి దగ్గర మూడు నాలుగు నెలలకు సరిపడా డబ్బు ఉంటుందా? అయాలు, డ్రైవర్స్, వాచ్మెన్స్ వీరి సంగతి ఏంటి మరి? అని ప్రశించారు.

2020-21 విద్య సంవత్సరం ఫీజు ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో అవరైనా ఉంటె తర్వాత చెల్లిస్తాం అని అనగలరు కదా? స్కూల్స్ ఏమైనా బలవంతంగా వచ్చి వసూల్ చేస్తాయా? కరెంటు కనెక్షన్ కట్ చేసినట్లు టి.సి లు ఇచ్చేస్తారా? లేకపోతె ఈ ఎం ఐ కట్టలేదు అని బండి స్వాధీనం చేసుకున్నట్లు పిల్లలను ఎత్తుకు వెళిపోతారా ? ఎన్ని కిరాణా దుకాణాలలో ఎక్కువ రేట్లకు అమ్మటం లేదు ? వాళ్ళు మాత్రం కరెక్ట్!! కానీ, వీలైతే ఫీజు కట్టండి అని ఎదో ఒక చిన్న ఆశతో అడగడం తప్పా అని అన్నారు.

ప్రైవేట్ స్కూల్లను భూతద్దంలో చూసి భూచోడీలా చిత్రీకరించకండి.. ఈ రోజు చూస్తే ప్రతి వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తున్నారు, నిన్నటికి నిన్న మన రైల్వేలు ప్రైవేటీకరించబడ్డాయి. అంటే ప్రైవేట్ వ్యవస్థ అనేది ఇవాళ అవునన్నా కాదన్నా రానున్న రోజుల్లో ప్రైవేట్ వ్యవస్థ దేశాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది అని మర్చిపోకండి.. మానవత్వం తో వ్యవహరించండని హితవు పలికారు.

Related posts