telugu navyamedia
రాజకీయ వార్తలు

నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా!

India china land border

ఇటీవలి కాలంలో చైనా ప్రోద్బలంతో నేపాల్ భారత్ మీద ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా నేపాల్ కు షాకిచ్చింది. టిబెట్ లో రోడ్డు విస్తరణ చేపట్టిన చైనా ఈ క్రమంలో నేపాల్ కు చెందిన 33 హెక్టార్లకు పైగా భూభాగాన్ని ఆక్రమించింది. నేపాల్ వ్యవసాయశాఖకు చెందిన సర్వే విభాగం ఈ విషయాన్ని నివేదికలో పేర్కొంది.ఆక్రమిత భూమిలో ఔట్ పోస్టులను నిర్మించబోతోందని సమాచారం.

ఇరు దేశాల మధ్య సహజసిద్ధంగా ఉన్న నదుల గమనాన్ని మార్చడం ద్వారా.. నేపాల్ లోని 10 ప్రాంతాలకు చెందిన 33 హెక్టార్ల భూమిని చైనా ఆక్రమించుకుంది. సర్వే విభాగం ఇచ్చిన నివేదికతో నేపాల్ ప్రభుత్వం షాక్ కు గురైంది. మరోవైపు నివేదికలోని అంశాలు ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. భవిష్యత్తులో మరింత భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

Related posts