telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జేమ్స్‌ బాండ్‌ నటుడు సీన్ కానరీ ఇకలేరు

James-Bond

ప్రముఖ సీనియర్ హాలీవుడ్‌ నటుడు, జేమ్స్‌ బాండ్‌ నటుడు సీన్ కానరీ ఇకలేరు. ఆయన వయసు 90 సంవత్సరాలు. ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్టు యూకే మీడియా వెల్లడించింది. “మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌. జేమ్స్‌ బాండ్”. సుమారు 58 ఏళ్లుగా ఈ పంచ్‌ డైలాగ్‌ను వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ జేమ్స్‌ బాండ్‌ చిత్రాలకు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఆస్కార్‌తో పాటు మూడు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను సీన్‌ కానరీ సొంతం చేసుకున్నారు. 1962లో విడుదలయిన ‘డాక్టర్‌ నో’తో తొలి బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత వచ్చిన ఐదు జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో బాండ్‌గా చేశారాయన. ‘ఫ్రమ్‌ రష్య విత్‌ లవ్, గోల్డ్‌ఫింగర్, తండర్‌బాల్, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్, డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌’ సినిమాల్లో బాండ్‌గా కనిపించారు షాన్‌ కానరీ. ఆ తర్వాత ‘ఆన్‌ హర్‌ మెజెస్టిక్‌ సీక్రెట్‌ సర్వీస్‌’ సినిమాలో జార్జ్‌ లెజెన్బీ బాండ్‌ అయ్యారు.

Related posts