దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓటమికి పీసీసీ రాజీనామా చేయాలని పదే పదే కొందరు..ఉత్తమ్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తమ్ దిగిపోవాలి అంటున్న వారు..పార్టీ కి సంబంధించిన వారు కాదని.. కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ లు పెడుతున్నారని మండి పడ్డారు. సీఎం కూతురు ఓడినా… దుబ్బాక లో ఓడినా..కేసీఆర్ ఫేయిల్ అని ఎందుకు పోస్టులు పెట్టడంలేదని ప్రశ్నించారు. గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఓడిపోలేదా… ఓటములు, గెలుపులు సహజమేనని తెలిపారు. దుబ్బాక ఒక ఎమోషన్ ఎలక్షన్… ఆ ఎమోషన్ ను బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుందన్నారు. దుబ్బాక ఫలితాలు మమ్మల్ని నిరుత్సాహ పరచలేవని.. ఆటు పోట్లు కాంగ్రెస్ కు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ కు బీజేపీ, టిఆర్ఎస్, ఎంఐఎం మూడు శత్రువులేనని తెలిపారు. టిఆర్ఎస్ ,హరీష్ రావు నియంత పోకడలకు ఈ ఓటమి సమాధానం చెప్పిందని…లక్ష ఓట్ల మెజారిటీ అన్న హరీష్ రావు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ట్రబుల్ షూటర్ కు ట్రబుల్ వచ్చిందని…ఓటమి కి నైతిక భాధ్యత వహిస్తూ ..హరీష్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.