telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మలైకా విడాకుల విషయంలో కొడుకు చెప్పిన మాటలు…

malika-arora

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న సందర్భంలో జీవితంలోనే అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పింది. విడాకులు కోరే ముందు రోజు కూడా నిర్ణయం మార్చుకోమని కుటుంబ సభ్యులు అడిగారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మలైక చెప్పింది. అయితే తన నిర్ణయానికి కొడుకు అర్హాన్ మద్దతుగా నిలిచాడని తెలిపింది. కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. నేను విడాకులు తీసుకోవడం సరైనది కాదని ప్రతి ఒక్కరూ హెచ్చరించారు. తన ముందున్న పరిస్థితులను అర్థం చేసుకున్న నా కొడుకు అర్హాన్ మాత్రం నన్ను సమర్థించాడు. ఓ రోజు అర్హాన్‌ నా దగ్గరికి వచ్చి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని చెప్పాడని మలైక గుర్తు చేసుకుంది.

Related posts