telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాక్ మీడియాలో ఈరోజు అన్నీ భారత్ వార్తలే!

Surgical Strike 2Pakistan Indian air space

భారత ప్రభుత్వం ఈరోజు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టింది. ఆర్టికల్ 370 రద్దు యావత్ భారతదేశం లో చర్చనీయంగా మారింది. మరోవైపు, మన దాయాది దేశం పాకిస్థాన్ కూడా అన్ని విషయాలను పక్కన పెట్టేసి, భారత్ లో ఏం జరుగుతోందా? అనే ఉత్కంఠంగా పరిశీలిస్తోంది. అక్కడి మీడియాలో భారత్ కు సంబంధించిన వార్తలే ప్రధానాంశాలుగా ప్రసారమవుతున్నాయి.

పాక్ మీడియాలో ప్రసారమవుతున్న ఇండియా హెడ్ లైన్స్:

-కశ్మీర్ లో కర్ఫ్యూ వాతావరణం.
-ఆర్టికల్ 35ఏ ఏం చెబుతోంది?
-గృహ నిర్బంధంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు
-కశ్మీర్ స్పెషల్ స్టేటస్ ను రద్దు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఇండియా.
-కశ్మీర్ లో ఇంటర్నెట్, సెల్ ఫోన్ సేవలను నిలిపివేసిన భారత్.
-ఓటు బ్యాంకు కోసం ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలేస్తున్న మోదీ.
-భారత ప్రభుత్వ వైఖరిని ఖండించిన ఇమ్రాన్ ఖాన్.
-ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి భారత్-పాక్ చర్చలు జరపాలి: ఐక్యరాజ్యసమితి.
-ఈ విధంగా భారత్, కశ్మీర్ వార్తలతో పాక్ మీడియా వెబ్ సైట్లలో బ్రేకింగ్ న్యూస్ ప్రసారమవుతున్నాయి.

Related posts