2013 లో గ్లామరస్ హీరోయిన్ కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోయినా కూడా కేథరీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక కేథరిన్ నానీ సరసన పైసా, అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో అనే తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దగ్గుబాటి రానాతో “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో ఆమె పండించిన సీన్లు యువప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఆమె తాజాగా నటించిన సినిమా “వదలడు”. ఆ సినిమాలో హీరో సిద్థార్థ్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. అయితే ఈ మధ్య కేథరిన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిద్ధార్థ్ సహజ నటుడు. సహజంగా నటిస్తూ మనల్ని అలాగే నటించేలా చేస్తాడు. అందుకే సిద్థార్థ్‌కు నేను పెద్ద ఫ్యాన్. సిద్థార్థ్ హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తిస్తారని పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు పుకార్లు పుట్టించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. నన్ను వాడుకున్నాడు. వాడటమంటే సినిమా పరంగా యాక్టింగ్ చేయడం. ఒక హీరోను డామేజ్ చేయడానికి కొంతమంది హీరోయిన్లు ఇలా చేయడం బాధనిపిస్తోంది. ఇలాంటివి మానుకోండి అంటోంది కేథరిన్. సిద్థార్థ్‌కు ఈమధ్య కాలంలో సినిమాలు తగ్గిపోయాయి. లేకలేక ఒక సినిమా అవకాశం వస్తే కేథరిన్‌ను ఆ సినిమాలో సిద్థార్థ్ బాగా వాడేశాడంటూ ప్రచారం జరగడంతో ఆమె ఈ విధంగా స్పందించారు.
previous post