telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నారా హీరోతో బాలయ్య సినిమా..!

Balakrishna

బాలయ్య తన కొత్త సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమాగా మంచి అంచనాలు పొందింది. బాలయ్య, బోయపాటి కాంబో అంటేనే అభిమానులకు వెర్రెక్కుతోంది. ఇది ఇలా ఉండగా.. మరో సినిమాకు ఓకే చెప్పాడట.  డైరెక్టర్‌ సాగర్‌ చంద్ర గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. సాగర్‌ చంద్ర “అప్పట్లో ఒకడుండేవాడు ” మూవీతో మంచి క్రేజ్‌ను సంపాదించాడు. ఈ సినిమా 2016 డిసెంబర్‌లో వచ్చింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు, నారా రోహిత్‌ కీలక పాత్రలు చేసిన విషయం తెలిసిందే…ఆ సినిమా తర్వాత కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా “అయ్యప్పనమ్ కోషియం” అనే మళయాలం సినిమాను రిమేక్‌ చేస్తున్నాడు సాగర్‌ చంద్ర. అయ్యప్పనమ్ కోషియం సినిమా మళయాలంలో మంచి విజయం సాధించింది. ఆ సినిమా తర్వాత మెగా హీరో వరుణ్‌ తేజతో సినిమా చేస్తున్నాడు. అయితే.. వరుణ్‌ తేజతో కంటే ముందుగా నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని చాలా అతృతగా ఉన్నాడట సాగర్‌ చంద్ర. ఇందులో భాగంగా ఇప్పటికే బాలకృష్ణ చర్చలు కూడా సాగుతున్నాయట. అయితే… దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. 

Related posts