telugu navyamedia
సినిమా వార్తలు

“రాక్షసుడు” మూడు రోజుల వసూళ్ళు

Rakshasudu

“అల్లుడు శీను” సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. “కవచం” వరకు అదే పంథాలో నడిచిన ఈ హీరో “సీత” సినిమాతో రూట్ మార్చాడు. భిన్నమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తమిళంలో విడుదలైన “రాక్షసన్”ను తెలుగు రీమేక్ “రాక్షసుడు”లో హీరోగా నటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. బి, సీ సెంటర్స్‌లో కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ఆదరణ బాగుంది. వ‌రుస ప్లాపుల‌తో ఉన్న బెల్లంకొండ‌కు ఈ సినిమా హిట్ పెద్ద ఊర‌ట ఇచ్చింది. ఈ సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.96 కోట్ల షేర్ రాబ‌ట్టింది. తొలి రోజు త‌క్కువ వ‌సూళ్లు వ‌చ్చినా శ‌ని, ఆదివారాల్లో పుంజుకుంది. దీంతో మూడు రోజుల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.6.65 కోట్ల షేర్ రాబ‌ట్టింది. రాక్ష‌సుడు ప్రి రిలీజ్ బిజినెస్ రూ.14 కోట్లు. వ‌చ్చే శుక్ర‌వారం మ‌న్మ‌థుడు-2తో పాటు మొత్తం మూడు సినిమాలు వ‌స్తున్నాయి. వారం రోజులు టైం ఉండ‌డంతో బెల్లంకొండ సేఫ్ అవుతాడ‌నే ట్రేడ్ అంచ‌నా వేస్తోంది.

రాక్ష‌సుడు 3 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ ఏరియా షేర్ (రూ.కోట్ల‌లో) :

నైజాం – రూ. 2.30
సీడెడ్ – రూ. 0.86
నెల్లూరు – రూ. 0.17
కృష్ణా – రూ. 0.43
గుంటూరు – రూ. 0.45
వైజాగ్ – రూ. 0.86
ఈస్ట్ – రూ. 0.40
వెస్ట్ – రూ. 0.33
ఏపీ + తెలంగాణ – రూ. 5.80
రెస్టాఫ్ ఇండియా – రూ. 0.60
ఓవ‌ర్సీస్ – రూ. 0.25
టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ – రూ. 6.65 కోట్లు

Related posts