telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండపై సంపూర్ణేష్ బాబు సెటైర్ ?

Sampu

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌య్యేందుకు సిద్ద‌మైంది. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి సందడి చేయనున్నాడు సంపూ. ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది. ఈ క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు. ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

అక్కడ సంపూ మాట్లాడుతూంటే ఓ వ్యక్తి వచ్చి కాళ్లపై పడతాడు. అందరూ షాక్… ఆ తర్వాత ఆ వ్యక్తిని నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగితే… ప్రొడ్యూసర్ గారు చేయమన్నారు అని చెప్పాడు. ఇది ఫన్ కోసం చేశారో మరేంటో తెలీదు కానీ… ఖచ్చితంగా విజయ్ దేవరకొండపై సెటైర్ అంటున్నారు నెటిజన్లు. ఇటీవల “డియర్ కామ్రేడ్” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ వ్యక్తి వచ్చి విజయ్ దేవరకొండ కాళ్లపై పడ్డాడు. అది మీడియాలో పెద్దగా హైలెట్ అయ్యింది. వెంటనే బౌన్సర్స్ వచ్చి అతన్ని వెనక్కి లాగటం, తర్వాత విజయ్ అతన్ని వదిలేయమని చెప్పటం జరిగింది. ఈ సంఘటనపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా సంపూ చేసిన పనికి విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts