telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

న్యూ ఇయన్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అక్కినేని కోడలు..!

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ బిగ్‌బాస్ షో ద్వారా తొలిసారి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించి అభిమానుల‌ను అల‌రించారు. ఇక ఇప్పటికే వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఓకే చెప్పిన సామ్.. హోస్టుగా కూడా సత్తా చాటాలని కుతూహలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆహా కోసం ఫుల్ టైమ్ హోస్ట్‌గా మారింది. ఇది ఇలా ఉండగా..తాజాగా సమంత… తన ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. సమంత నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ “ది ఫ్యామిలీ మ్యాన్‌-2” కొత్త ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో సమంత వెల్లడించింది. “చాలా కాలం వేచి ఉన్నందుకు మీ ప్రేమ, సహనానికి ధన్యవాదాలు. కొత్త సంవత్సరంలో మీకు ఓ బహుమతి తెస్తున్నా. వేచి ఉండండి..! ” అని ఇన్‌స్టాలో సమంత పోస్టు పెట్టింది. ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించనుంది ఈ అందాల భామ. అయితే.. దీని విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. ప్రస్తుతం సమంత చేతిలో రెండు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.

Related posts