telugu navyamedia
సినిమా వార్తలు

కృష్ణవంశీ రంగమార్తాండ టైటిల్ లోగో రిలీజ్‌

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగమార్తాండ’. ఈ చిత్ర టైటిల్ లోగోను తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్స్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటిస్తున్నారు.

రంగమార్తాండ సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయి. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన అమ్మానాన్నల కథ గా రంగమార్తాండ థియేటర్స్ కు రానుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనుంది.కృష్ణవంశీ కెరీర్ లో 21వ సినిమాగా ఈ చిత్రం విడుదల కానుంది.

Related posts