రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహర్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ‘అక్డీ పక్డీ’ అంటూ సాగే ఆ పాటను భాస్కరభట్ల రవికుమార్ రచించగా అనురాగ్ కులకర్ణ, రమ్య బెహరా ఆలపించారు.
పూర్తి పాటను ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు లైగర్ చిత్ర బృందం వెల్లడించింది. ఈ ప్రొమోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మొట్టమొదటిసారిగా మాస్ స్టెప్పులు వేశాడు రౌడీ హీరో. ఈ స్టెప్పులకు విజయ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కాగా, ఈ సినిమాలో దిగ్గజ బాక్సక్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ చిత్రంతో పాటు విజయ్-పూరి కాంబోలో ‘జనగణమన’ తెరకెక్కుతోంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్. ఆర్మీ నేపథ్యంలో రూపొందుతోందీ మూవీ.