telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “కలర్ ఫోటో” టీజర్… ఈ సుహాస్‌ని తొక్కేయాలి బ్రహ్మాజీ కౌంటర్

Color-Photo

”మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజూ పండగే” వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్.. ‘కలర్ ఫొటో’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా.. సుహాస్ సరసన తెలుగమ్మాయి చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా టీజర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు, సుహాస్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కలర్ ఫోటో టీజర్‌ చూసిన టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఎంతో స్వీట్, ఫీల్ గుడ్‌లా ఉంది. నిర్మాత సాయి రాజేష్‌ పట్ల ఎంతో సంతోషంగా ఉంది..ఈ మొదటి చిత్రంతోనే డైరెక్టర్ సందీప్ రాజ్‌కు మంచి విజయం అందాలి. సుహాస్ ఫైర్ మీదున్నాడు. చాందినీ, సునీల్ సార్, వైవా హర్ష అందరూ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. దీంతో వెన్నెల కిషోర్ ట్వీట్‌ చూసి మరో నటుడు బ్రహ్మాజీ వెంటనే రియాక్ట్ అయ్యారు. అన్నీ బాగున్నాయ్ కాకా.. ఈ సుహాస్‌ని తొక్కేయాలి. అతనిలో చాలా టాలెంట్ ఉంది.. లేకపోతే మనకే డేంజర్ అంటూ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts