telugu navyamedia
రాజకీయ

అమర్‌నాథ్‌ యాత్ర : భోలేనాథ్‌ గుహ సమీపంలోనే హఠాత్తుగా కుంభవృష్టి..

*అమ‌ర్‌నాథ్ స‌మీపంలో భారీ వ‌ర‌ద‌
*భోలేనాథ్ గుహ స‌మీపంలో కుంభ‌వృష్ణి..
*కొండ‌వాలులు పై నుంచి భారీగా ఫోటెత్తిన వ‌ర‌ద‌
*యాత్ర‌ను నిలిపివేసిన ప్ర‌భుత్వం
*కుంభ‌వృష్టి స‌మ‌యంలో అక్క‌డే 12 వేల మంది భ‌క్తులు..

జమ్ముకశ్మీర్‌ అమర్‌నాథ్‌ యాత్రను ఊహించని విపత్తు ముంచెత్తింది. శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో ఆకస్మిక వరద పోటెత్తింది.

అమర్‌నాథ్ గుహ స‌మీపంలో కొండ‌వాలులు పై నుంచి భారీగా వరద నీరు చేరుకుంది .. సుమారు 12 వేల మంది భక్తులు వరదలో చిక్కుకుపోయారు. వరద ఉధృతికి పలువురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. 

ఆకస్మిక వరద ఉదృతికి యాత్రికుల 25 దాకా టెంట్లు మొత్తం కొట్టుకుని పోయాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 40 మంది దాకా గ‌ల్లంతైన‌ట్టు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య భారీగా పెరగొచ్చని భావిస్తున్నారు. 

ఆకాశం బద్ధలైనట్లుగా.. 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

 ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.దీంతో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది

 

Related posts