తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ మాట్లాడారు. “మొదటి సారి మీడియాను చూసి భయం వేస్తోంది. ‘మా’ది చిన్న అసోసియేషన్. దీనిపై వస్తున్న ఊహాగానాలు చూసి భయం వేసింది. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ ఇది. కానీ అందరికి ఎంటర్ టైన్ గా మారిపోయింది. ఇక్కడ ఏదో జరుగుతోంది. చూస్తూ ఉరుకోలేం… ‘మా’ అధ్యక్ష పదవికి పోటీలో నిలబడాలని నిన్న మొన్న ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఏడాదిగా ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ చేశాము. కళ్ళముందు ఉన్న వాళ్ళు సగం మందే… వాళ్ళను ఈ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ అని ఫిక్స్ చేయొద్దు. మేము సైలెంట్ గా వర్క్ చెయ్యాలనుకుంటున్నాం. మా ప్యానల్ లో గట్టిగా మాట్లాడే వాళ్ళున్నారు. అయితే చిరంజీవి గారిని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు” అన్నారు ప్రకాష్ రాజ్. మరోవైపు ప్రకాష్ రాజ్ వేరే పరిశ్రమకు చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ పోటీ చేయడానికి ఒప్పుకోమని అంటున్నారు కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు.
previous post
next post