telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దర్శకుడు వివి వినాయక్ పై నాగ్ సెటైర్

Nag

105 రోజుల బిగ్ బాస్ ఆటకు నేటి రాత్రితో తెరపడనుంది. నాగార్జున హోస్ట్‌గా 17 మంది కంటెస్టెంట్స్‌తో జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ సీజన్ 3‌లో ఆదివారం నాడు రాహుల్ ను విజేతగా ప్రకటించారు. అయితే బిగ్‌బాస్ 3 గ్రాండ్ ఫినాలేలో నాగార్జున వినాయక్‌కు పంచ్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. హౌస్‌లో టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్ భాగంగా దర్శకుడు మారుతి, రాశిఖన్నాను హౌస్‌లో పంపించాడు. ఈ సందర్భంగా బాబా భాస్కర్‌తో వాళ్లతో డాన్స్ చేయించమని పురమాయించాడు. కానీ మారుతి మాత్రం హీరోయిన్స్‌ హీరోలు డాన్స్ చేయడం ఒకే కానీ.. దర్శకులు డాన్స్ చేయడము ఏమిటి అని అడగగా.. నాగార్జున.. ఈ మధ్యకాలంలో దర్శకులందరు హీరోలవుతున్నారు. అంతేకాదు మా కంటే బాగా నటిస్తున్నారు అంటూ శీనయ్యగా రాబోతున్న వినాయక్‌పై పంచ్ వేసాడు. ఈ మధ్యకాలంలో దర్శకులు నటించడం ఓకేకానీ పూర్తి స్థాయి హీరోగా నటించలేదు. కానీ వి.వి.వినాయక్ మాత్రం పూర్తి స్థాయి కథానాయకుడిగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. నాగార్జున కూడా వినాయక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో అందరు చెవులు కొరక్కుంటున్నారు. తన కొడుకు అఖిల్ హీరోగా పరిచయం చేసిన ‘అఖిల్’ సినిమాను వినాయక్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచి హీరోగా అఖిల్ కెరీర్‌కు పెద్ద బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే కదా. అందుకే నాగార్జున.. వినాయక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

Related posts