telugu navyamedia
సినిమా వార్తలు

ఈనెల 19న “స్ట్రీట్ లైట్” మూవీ..

హీరో వినోద్ కుమార్, తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో “స్ట్రీట్ లైట్” సినిమా తెరకెక్కించారు. మూవీ మ్యా్క్స్ బ్యానర్ పై మామిడాల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యం వహించారు. స్ట్రీట్ లైట్ సినిమా ఈనెల 19 తేదీన తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులముందుకు రాబోతోంది.

సమాజంలో చోటుచేసుకునే ఘటనలు… పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నవారిలో క్రిమినల్ ఆలోచనలు, వారి వ్యవహారశైలి, అమాయకుల జీవితాలతో ఆడుకునే తీరూతెన్నులపై ఓ వినోదాత్మక సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఎదిగేవయసులో కొత్త పరిచయాలు, చిగురించే ప్రేమ, కుటుంబంలో బంధాలు, ప్రేమ నేపథ్యంలో భావో ద్వేగాల మేళవింపుతో కొత్తసినిమాను విశ్వ తెరకెక్కించారు. స్ట్రీట్ లైట్ పేరుతో సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Related posts