telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ “రాధేశ్యామ్”కు తమన్ సంగీతం ?

Radheshyam

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ లుక్’‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. మొదటగా ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తారని అన్నారు ఆ తర్వాత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెహమాన్ పెద్దగా ఇంటరెస్ట్ చూపట్లేదని సమాచారం. ఇప్పుడు తమన్ కి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. తమన్ ఈమధ్య తన మ్యూజిక్ తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కోసం తమన్ సంగీతం అందించనున్నాడా లేదా అన్న విషయం పై త్వరలో క్లారిటీ రానుంది. 1960 కాలం నాటి ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

Related posts