ప్రణయామృత ఝరిలో
వాస్తవానికి ఈవు
వన జాత ప్రసూనానికి
ప్రతి రూపానివే-
మన ప్రేమ జీవన రాగంలో
సుధా పూరిత స్రవంతివే
ప్రేమంతో నిండిన
వసుధైక కుటుంబంలో
ప్రాదుర్భవించిన
ప్రణయాంతఃపుర రాణివే –
నన్ను నీ ఇంగిత సంగీతంతో
సతతం చుక్కానివై నడిపించే
ప్రేమ సామ్రాజ్య ప్రాజ్ఞు రాలివే-
ఓ మదన మంజరీ!
సమ్మోహన సౌగంధ విరీ!
కాలగతి లో భాతి వీవే-
నా లక్ష్య సాధనకు గతి నీవే-
నాలో భావోదయ విరిదండకు
సూత్రం ఈవే
నా మతి ప్రగతిని
ప్రచోదితం చేసే
రెండక్షరాల ప్రేమ మంత్రం నీవే !
-మహేంద్రాడ సింహాచలాచార్య ,
టెక్కలి.