telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘గుడ్ లక్ సఖి’ వచ్చేస్తుంది…

మహానటి’ చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్, ఉత్తమ జాతీయనటిగా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు..కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ అనే చిత్రాలు చేస్తుండ‌గా ‘అన్నాతే’ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ వంటి తమిళ సినిమాలోనూ సినిమాలలో నటిస్తుంది కీర్తి. వీటిలో ‘గుడ్ లక్ సఖి’ సినిమా ఎప్పుడో పూర్తయిన కరోనా కారణంగా విడుదల కాలేదు. ఇంతకముందే విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి టాక్ తెచ్చుకుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర నిర్మించారు. అయితే మొదట ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు ఎంత ప్రచారం జరిగిన అది జరగలేదు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఈ ఎదహి జూన్ 3న ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Related posts