telugu navyamedia
సినిమా వార్తలు

ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం..

ప్రముఖ బాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ కేకే (53)అలియాస్ కృష్ణకాంత్ కున్నాత్ ఆకస్మికంగా కన్నుమూశారు. కేకే పేరుతో ప్రసిద్ధి గాంచిన కృష్ణకుమార్‌ కున్నాత్ కోల్‌క‌తాలో లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఆయన హఠాత్తుగా కుప్పకూలారు. వెంటనే సీఎంఆర్‌ఐ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Bollywood singer KK dies after concert in Kolkata , Bollywood singer Krishnakumar Kunnath, Singer KK demise, concert at Gurudas College in Kolkata

ఢిల్లీలో జన్మించిన కేకే 1999లో బాలీవుడ్‌ చిత్రం పాల్‌ సినిమాతో పరిచయమయ్యారు. అనంతరం పలు హిట్‌ సాంగ్స్‌ పాడి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లో పాటలు పాడారు. ఆయన స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇస్తే స్టేడియం, ఆడిటోరియం కిక్కిరిసిపోతుంది.

RIP KK: Singer's last Instagram post was about his 'pulsating gig' & filled with love for fans | Celebrities News – India TV

కేకే మృతితో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన గాయకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడని సోష‌ల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.

KK Dead After Concert: Popular Indian Singer & Actor Was 53 – Deadline

కాగా.. కేకే మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.‘‘కేకే పాటలు అన్నిరకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి. అన్ని వయసుల వారిని అలరిస్తాయి. ఆయన పాడిన పాటలతో కేకే ఎప్పటికీ గుర్తించుకుంటాం. కేకే కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.’ అని అక్షయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌, సింగర్స్‌ ప్రీతమ్‌, జుబిన్ నటియాల్, ఆర్మాన్‌ మాలిక్‌, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. .

Related posts