telugu navyamedia
సినిమా వార్తలు

మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు విజ‌య‌భేరి…

నరాలు తెగే ఉత్కంఠత నడుమ మా ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో   మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. 

ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు.

 భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మంచు విష్ణు ప్యానల్ జోష్‌లో ఉంది. కౌంటింగ్‌ కేంద్రం బయట అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మోహన్ బాబు జిందాబాద్, విష్ణు బాబు జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున‌ నినాదాలు చేస్తున్నారు. 

Related posts