telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముద్దుకు మించి ఏమన్నా చేసుంటే… నేహా కక్కర్ ముద్దు ఘటనపై సింగర్ వ్యాఖ్యలు

Neha

ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్’లో ఓ వ్యక్తి గాయని నేహా కక్కర్ నడుం పట్టుకుని ముద్దు పెట్టుకున్న ఘటన ఎంత వైరల్‌గా మారిందో తెలిసిందే. దీనిపై తాజాగా ప్రముఖ సింగర్ ఆదిత్య నారాయణ్ స్పందిస్తూ “నేను నేహాను కాపాడటానికి వెళ్లాను. కానీ ఆ తర్వాత జరిగిన దానికి నేనేమీ చేయలేను. నేహాను ముద్దు పెట్టుకున్న వ్యక్తి చేతిపై ఆమె పేరుతో టాటూ కూడా ఉంది. కాబట్టి అతను నేహాకు వీరాభిమాని అయివుంటాడు. ఆ అభిమానంతోనే అలా ముద్దుపెట్టుకుని ఉంటాడు. అలా చేయడం వెనక దురుద్దేశం లేదని నా అభిప్రాయం. పోన్లే అతను నేహా బుగ్గపై ముద్దు ఇచ్చి ఊరుకున్నాడు. అంతకుమించి ఏమన్నా చేసుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చేది. నేహాది మంచి మనసు కాబట్టి అతని అభిమానం చూసి ఏమీ అనకుండా వదిలేసింది. ఏదేమైనా మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా మేం జాగ్రత్త పడతాం” అని వెల్లడించారు. గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడైన ఆదిత్య.. ఈ ఘటన జరిగిన రోజున పక్కనే ఉన్నాడు. నేహాను ఆ వ్యక్తి ముద్దుపెట్టుకుంటున్నప్పుడు అతను వెళ్లి నేహాను కాపాడాడు.

Related posts