telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంబులెన్స్ డ్రైవర్​గా మారిన కన్నడ హీరో

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.  ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, హీరోలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే తాజాగా కరోనా రోగుల కోసం అంబులెన్స్ డ్రైవర్ గా మారాడు కన్నడ హీరో అర్జున్ గౌడ. కరోనా రోగులను, మృతదేహాలను నటుడు అర్జున్ గౌడ అంబులెన్సులో తరలిస్తున్నారు. కరోనా రోగులను హాస్పిటల్ కు, దిక్కులేకుండా పడి ఉన్న మృతదేహాలను స్మశానలకు తరలిస్తున్నాడు అర్జున్. ఇందుకు స్వయంగా తానే అంబులన్స్ ను సమకూర్చుకొని, నడుపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నటుడు అర్జున్ గౌడ “ప్రాజెక్ట్ స్మైల్ ట్రస్ట్”” ను ఏర్పాటు చేశాడు. ఇక ఇప్పటికే అంత్యక్రియల కోసం ఆరు కుటుంబాలకు సాయం చేశానని..మరో రెండు నెలల పాటు తాను ఈ డ్రైవ్ ను కొనసాగిస్తానని అర్జున్ గౌడ పేర్కొన్నారు. 

Related posts