మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై 400 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
జూబిలీహిల్స్ స్కూల్ లో “మా ” ఎన్నికల లెక్కింపు జరుగుతున్నసందర్భంగా అధ్యక్షుడుగా మంచి విష్ణు గెలిచాడని ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో మంచు అభిమానులు ఆనందోత్సాహాలతో బాణాసంచా కాల్చారు . అక్కడే వున్న మిగతా నటీనటులందరూ విష్ణును కౌగిలించుకొని అభినందనలు తెలిపారు.
మంచు కుటుంబం అంతా అక్కడే ఉండి ఈ ఆనందోత్సాహాలలో పాలు పంచుకున్నారు . నేనే గెలుస్తాను అని ప్రకటించిన విష్ణు “మా ” ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు .
“మా ” నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు నవ్య మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ : ఆర్జీవీ