telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇలా ఎప్పుడైనా రామ్ చరణ్ ని చూసారా… !

ramcharan

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి దర్శకత్వంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై స‌నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ చిత్రానికి ‘రఘుపతి రాఘవ రాజారాం’ టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు కాబట్టి.. ఈ సర్ ప్రైజ్ లుక్ ఆ సినిమాలోదే అనుకోవచ్చు. కాని ఈ ఫొటో వెనుక ఉన్న కథ వేరే. ఇది రాజమౌళి చెక్కిన కండల శిల్పం కాదు. ఓ సాదాసీదా ఫ్యాన్ క్రియేట్ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్. అవును.. రామ్ చరణ్ తేజ్‌ను తాను ఎలాగైతే చూడాలని అనుకుంటున్నాడో ఆ లుక్‌లో ఫొటో షాప్ చేసి ఈ కండల రామ్ చరణ్‌ని తయారు చేశాడు ఓ ఫ్యాన్. ‘అన్నా.. ఈ లుక్‌లో ఒక సినిమా రావాలి.. వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం పక్కా’ అంటూ ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ వదిలారు ఓ అభిమాని. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ ఫేస్ తప్పితే.. హెయిర్, బాడీ మొత్తం కూడా ఒరిజినల్ కాదు. ఒక్కో హీరో నుండి ఒక్కో పార్ట్‌ను తీసుకుని ఇలా కండల వీరుడిగా పోస్టర్ తయారుచేశాడు. అయితే రామ్ చరణ్ ఫిజిక్‌కి ఏదైతే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయో వాటినే తీసుకున్నాడు ఆ ఫ్యాన్. దీంతో చెర్రీ ఫేస్‌కి ఆ సిక్స్ ప్యాక్ బాడీ, హెయిర్ కట్, లుంగీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts