telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేరళలో నయన్ పెళ్లి ఏర్పాట్లు ?

nayanatara love story as movie

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించిన వార్తలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ అయిన ఈ 36 ఏళ్ళ బ్యూటీ అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం నయన్ కుటుంబ సభ్యులు అదే పనిలో నిమగ్నమై ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కేరళలోని ఓ అమ్మవారి గుడిలో నయనతార పెళ్లి జరిపించాలని ఫిక్సయ్యారట. గతకొంతకాలంగా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్, నయన్ ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల అంగీకారం కూడా లభించిందట. అతిత్వరలో పెళ్ళి విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారని నయన్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కెరీర్ ఆరంభం లోనే హీరో శింబుతో ప్రేమాయణం కొనసాగించి బ్రేకప్ చెప్పిన నయన్.. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయ్యాక ఊహించని విధంగా ఆయనతో కూడా కట్ చేసుకుంది. ఆ వెంటనే తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం స్టార్ చేసిన విషయం తెలిసిందే.

Related posts