telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీకాంత్ సీఎం కాకపోయినా 2021లో నేను సీఎం అవుతా : వడివేలు

rajanikanth

రజినీకాంత్ నటించిన ప్రతి సినిమాలోనూ వడివేలు ఉన్నారు. ‘లింగా’ సినిమా నుంచి రజినీ, వడివేలు మధ్య దూరం పెరిగింది. ఆ సినిమాలో ఒక పాత్రను చేయడానికి వడివేలు అంగీకరించలేదు. దాంతో రజినీ, వడివేలు మధ్య మనస్పర్థలు వచ్చాయని అప్పట్లో వదంతలు పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే, తాజాగా రజినీకాంత్‌పై వడివేలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వడివేలు తప్పుగా ఏమీ మాట్లాడకపోయినా.. రజినీని ఉద్దేశించి కొంచెం సెటైరికల్‌గా మాట్లాడారు. తూతుకూడి జిల్లాలో ఉన్న తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని తాజాగా వడివేలు సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వడివేలు ఆలయం నుంచి బయటికి వస్తోన్న సమయంలో ఆయన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. అయితే.. తాను రాజకీయ పార్టీని పెడతాను కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయనని.. విజ్ఞానవంతుడైన వ్యక్తినే సీఎంను చేస్తానని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని వడివేలును విలేకరులు కోరారు. ఆయన చెప్పింది కరెక్టే కదా. రజినీ సార్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో నీకు తెలీదు, నాకు తెలీదు, అసలు ఆయనకే తెలీదు. ఆయన సీఎం కాకపోయినా 2021లో నేను సీఎం అవుతా. ఏ మీరంతా నాకు ఓటు వేయరా అని వడివేలు సరదాగా అక్కడున్న వారిని అడిగారు. వారంతా ఓటేస్తాం అని అనగానే.. ‘‘అయితే నేనే సీఎం’’ అని నవ్వుతూ అన్నారు.

Related posts