telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాక్సినేషన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు…

gangula kamalakar trs

కరోనా వాక్సినేషన్ పై మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరిగే కోవిడ్ వ్యాక్సినికేషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సాయంత్రంలోగా వాక్సిన్లు అన్ని జిల్లాలకు చేరుతాయన్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా వాక్సినేషన్ ప్రక్రియలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని సీఎం చెప్పారని… కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 12619 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ సిబ్బందికి వాక్సిన్ ఇస్తామనిపేర్కొన్నారు. వీరిలో 4243 మంది ప్రభుత్వ, 8176 మంది ప్రయివేటు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది ఉన్నారని.. జిల్లాలో ఈనెల 16న నాలుగు సెంటర్లలో వాక్సినేషన్ ప్రారంభిస్తామని… 18 నుంచి 31 సెంటర్లలో వాక్సినేషన్ చేస్తామని తెలిపారు. మొదటి రోజు కరీంనగర్, హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జిల్లా ఆస్పత్రితో పాటు నగరంలోని బుట్టిరాజారాం కాలనీ, తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తామని తెలిపారు. ఈ వాక్సినేషన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని… చిన్న చిన్న ప్రభావాలు కనిపించినా అన్ని రకాల వైద్యులను సిద్ధం ఉంచామని భరోసా కల్పించారు. ఈ వాక్సినేషన్ కు ఎలాంటి ఫీజు లేదని స్పష్టం చేశారు.

Related posts