telugu navyamedia
సినిమా వార్తలు

వెండితెరపై “శశిలలిత”గా జయలలిత బయోపిక్

Sasilalitha

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను వెండి తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో జయలలిత జీవితం ఆధారంగా రెండు, మూడు బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మాణంలో మరో బయోపిక్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ”గతంలో ఎన్నో చిత్రాలను నిర్మించాను. అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమా తీస్తున్నాను. ఇప్పుడు జయ లలిత బయోపిక్ కూడా తీయాలని అనుకుంటున్నాను. అన్ని రకాల కోణాల్లో ఈ సినిమాను తీయాలనుకుంటున్నాను. దీనికి “శశిలలిత” అనే టైటిల్ ఫిక్స్ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో జయలలిత బాల్యం, హీరోయిన్ గా ఎదుగుదల, లవ్ ఎఫైర్, శోభన్ బాబుతో ఆమె ప్రేమాయణం, ఆసుపత్రిలో చివరి రోజుల్లో ఆమె ఎలా గడిపారనే విషయాలను చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Related posts