telugu navyamedia
సినిమా వార్తలు

లిప్ లాక్ గురించి మాట్లాడితే… ఆ అమ్మాయితో పని కష్టం : యామీ గౌతమ్

Yami-Gautham

ఇటీవల కాలంలో భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో వెండితెరపై ముద్దు సన్నివేశాలు సర్వ సాధారణంగా మారాయి. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ “అర్జున్ రెడ్డి” చిత్రం తరువాత ఎక్కువైంది. అయితే కొత్తతరం హీరోయిన్లు తెరపై ముద్దు సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాలకు సంతకం చేసేటప్పుడు “ముద్దులకు నో” అంటూ దర్శకనిర్మాతలకు నిబంధనలు పెడుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‌ కూడా ఒకటి రెండు సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించారు. హీరోయిన్లు ముద్దు సన్నివేశాలకు “నో” చెప్పే నిబంధన గురించి యామీ గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ… “అందులో అనైతికం ఏముంది? తప్పేముంది ? నేను సినిమాకు సంతకం చేసేటప్పుడు అటువంటి నిబంధనలు ఏమీ పెట్టను. కానీ కథకు అవసరం లేకుండా ముద్దులు పెట్టడం నాకిష్టం ఉండదు. అది కష్టమైన పని. చాలా అసౌకర్యవంతంగా ఉంటుంది. ‘నటీనటులుగా ముద్దులు పెట్టడం ఓ పెద్ద విషయమా?’ అంటే నా దగ్గర సమాధానం లేదు. మేమెంత ఆర్టిస్టులమైనా మనుషులమే కదా! చాలా సార్లు అమ్మాయిలు ఈ అంశం గురించి మాట్లాడలేరు. మాట్లాడరు కూడా. ఒకవేళ మాట్లాడితే ఆ అమ్మాయితో పని చేయడం కష్టమని అంటుంటారు” అని తెలిపారు.

Related posts