సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మా ఎన్నికల పర్వం ముగింపు దశకి చేరుకుంది. మంచు విష్ణు ప్యానెల్ పై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఘన విజయాలు నమోదుచేశారు. మొత్తం మా ప్యానల్ లో 18మంది ఈసీ సభ్యులు ఉండగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 8మంది సభ్యులు గెలుపొందగా.. మంచు విష్ణు ప్యానల్ నుండి 10మంది విజయం సాధించారని తెలుస్తుంది.
ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి అత్యధిక మెజారిటీతో యాంకర్ అనసూయ గెలుపొందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నిర్మాత సురేశ్ కొండేటి కూడా ఈసీ మెంబర్ గా గెలుపు ఖరారు అయింది. వీరితో పాటు శివారెడ్డి, కౌశిక్ కూడా ప్రకాశ్ ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్లుగా విజయం సాధించా రు.
విష్ణు ప్యానెల్ దూకుడు..
మా జనరల్ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు. ట్రెజరర్‌గా మంచు విష్ణు ప్యానెల్ నుంచి శివ బాలాజీ 32 ఓట్ల తేడాతో గెలుపొందారు. శివబాలాజీకి 316 ఓట్లు, ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు చెందిన నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి.
మంచు విష్ణు ప్యానల్‌లో 10మంది విజయం
మంచు విష్ణు ప్యానల్ నుంచి 10మంది ఈసీ సభ్యులు విజయం సాధించారు. మాణిక్, హరినాథ్, బొప్పన,శివ, జయవాణి, శశాంక్, పూజిత, పసునూరి, శ్రీనివాస్, శ్రీలక్ష్మీ గెలుపొందారు..
మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని… సిద్ధార్థ్ తో గురించి సమంత సంచలన వ్యాఖ్యలు