telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆచార్య లీక్స్ పై నిర్మాతలు ఫిర్యాదు…

ప్రస్తుతం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఒక్కటి. అయితే మే నెలలో విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ మేరకు బొగ్గు గనుల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. కాగా ఆచార్య షూటింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి, రామ్ చరణ్ పాత్రల చిత్రీకరణ ఫొటోలు వైరల్ పై చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల వైఫల్యం కారణంగానే ఫోటోలు బయటకు వెళ్లాయని ఉన్నతాధికారులకు చిత్ర నిర్మాతలు ఫిర్యాదు చేశారు. మొదటి రోజు ఘటనతో ఆచార్య షూటింగ్ స్పాట్ లో ఆధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. చూడాలి మరి ఈ లీకులు ఇప్పటికైనా ఆగుతాయా… లేదా అనేది.

Related posts