telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఆన్ లైన్ బోధనలో అసభ్య సందేశాలు.. ఇద్దరు టీచర్ల అరెస్ట్

cell phone

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో విద్యాబోధన జరుపుతుండడం తెలిసిందే. అయితే, ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్ లైన్ విద్యాబోధన పేరిట అసభ్య సందేశాలు పంపుతూ తమ కీచక నైజాన్ని బయటపెట్టుకున్నారు.

షాబాద్ కు చెందిన శ్రీకాంత్, సురేందర్ అనే టీచర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఓ 9వ తరగతి విద్యార్థిని అడిగిన ప్రశ్నలకు సవ్యరీతిలో సమాధానాలు చెపాల్సిందిపోయి, జుగుప్సాకరరీతిలో అసభ్య సమాధానాలు పంపారు. దాంతో ఆ విద్యార్థిని షీటీమ్ ను ఆశ్రయించింది. ఆ ఇద్దరు టీచర్ల అరాచకంపై వెంటనే స్పందించిన సైబరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Related posts