telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎప్పటికీ నా చేయి వదలనని ఇలా చేశావేంటి?… చిరంజీవి సర్జా భార్య ఎమోషనల్ పోస్ట్

chiranjeevi sarja

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భార్య మేఘనా రాజ్ కూడా నటే. తాజాగా ఆమె తన భర్తను తలచుకుంటూ ఓ భావోద్వేగ లేఖను ట్వీట్ చేసింది. “చిరు… నీకు ఎన్నో విషయాలను చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో ఎంత ప్రయత్నించినా తెలియడం లేదు. నువ్వు నాకు ఎంత ముఖ్యమో ఈ ప్రపంచంలో దేనితో వర్ణించలేను. ఫ్రెండ్‌వి, ప్రేమికుడివి, జీవిత భాగస్వామివి, నాకు చంటి పిల్లాడివి, నా ధైర్యానివి.. ఇలా ఏదని చెప్పను. వీటన్నింటి కంటే నువ్వు నాకు ఎక్కువే. నువ్వే నా ప్రాణం. ఏదో బాధ అర్థం కావడం లేదు కానీ ప్రతీక్షణం కృంగదీస్తోంది. నువ్వు లేవని తలుచుకుంటేనే చిత్రవధలా ఉంది. వేల రెట్లు నరకం అనుభవిస్తున్నంత బాధగా ఉంది. నా చుట్టూ ఏదో వలయం అల్లుకున్నట్లుంది. నేను బాధపడుతున్న ప్రతిసారీ నువ్వు నా చుట్టూనే ఉన్నావనే ఫీలింగ్ కలుగుతుంది. నన్ను ఎంతగానో ప్రేమించాను అన్నావు. ఎప్పటికీ నా చేయి వదలనంటూ మాటిచ్చావు. కానీ ఇలా చేశావేంటి? అయినా మన ప్రేమకు చిహ్నంగా నాకో చిన్నారిని ఇస్తున్నందుకు జీవితాంతం నీకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. నా నుంచే మళ్లీ నిన్ను భూమిపైకి తీసుకువచ్చేందుకు ఎంతో ఎదురు చూస్తున్నాను. మళ్లీ నీ తోడు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని తహతహలాడుతున్నాను. నీ నవ్వు కోసం, ఆ నవ్వులతో విరజిమ్మే కాంతుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. నేను నీకోసం, నువ్వు నాకోసం ఎదురు చూస్తూనే ఉంటాం. నీవు చనిపోయావని అనుకోవడం లేదు. నా ఊపిరి ఉన్నంత వరకు నీవు బతికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అని మేఘనా రాజ్ తన ట్వీట్‌లో పేర్కొంది. ఇందులో ఆమె చేర్చిన ప్రతి అక్షరం నిజంగా చిరంజీవి సర్జాకు కన్నీటి వీడ్కోలు‌లా ఉంది.

Related posts